సమ్మెలో మేమూ పాల్గొంటాం

ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Published : 23 Jan 2022 04:57 IST

ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం

విజయవాడ, న్యూస్‌టుడే: ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఆస్కారరావు ప్రకటించారు. ‘‘కార్మిక చట్టాల ప్రకారం ప్రత్యేకంగా సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేస్తాం. అవసరమైతే వైద్య సేవలను సైతం నిలిపివేయడానికి వెనకాడబోం. సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో నిర్లిప్తత ప్రదర్శించడం సరికాదు. తక్షణమే 30% తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ప్రకటించాలి.  హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథాతథంగా అమలు చేయటంతోపాటు ఒప్పంద ఉద్యోగులను రెగ్యులైజ్‌ చేయాలి’ అని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని