మళ్లీ పెరిగిన పాజిటివిటీ రేట్‌

కొవిడ్‌ పాజిటివిటీ రేట్‌ మళ్లీ పెరిగింది. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 41,771 నమూనాలు పరీక్షించారు. వీటిద్వారా 13,474 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేట్‌

Published : 28 Jan 2022 03:03 IST

కొత్తగా 13,474 కొవిడ్‌ కేసుల నమోదు

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ పాజిటివిటీ రేట్‌ మళ్లీ పెరిగింది. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 41,771 నమూనాలు పరీక్షించారు. వీటిద్వారా 13,474 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేట్‌ 32.2%గా నమోదైంది. బుధవారం 49,143 నమూనాలు పరీక్షించగా 13,618 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. పాజిటివిటీ రేట్‌ 27.7%గా నమోదైంది. మంగళవారం 46,929 నమూనాలు పరీక్షించగా 13,819 కేసులతో పాజిటివిటీ రేట్‌ 29.44%గా రికార్డయింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,835, తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 259 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని