Andhra News: రాష్ట్ర విభజన జరిగితే మళ్లీ రాజధాని సమస్య.. అందుకే 3 రాజధానులు..

రాష్ట్ర విభజన జరిగితే మళ్లీ రాజధాని సమస్య ఎదురవుతుందని, అందుకే మూడు రాజధానుల అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం ఆయన ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు.

Updated : 07 Mar 2022 08:06 IST

 ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన జరిగితే మళ్లీ రాజధాని సమస్య ఎదురవుతుందని, అందుకే మూడు రాజధానుల అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం ఆయన ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. అరవై ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను విభజన వల్ల కోల్పోయామన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మూడు రాజధానులు అవసరమని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థపూరితంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమం వచ్చి విభజన పరిస్థితి ఎదురైతే రాజధాని సమస్య లేకుండా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వికేంద్రీకరణతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని కృష్ణదాస్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని