CM Jagan: 22న ఒంగోలుకు సీఎం జగన్‌? బాలినేనికి కీలక పదవిపై వెల్లడి?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22న ఒంగోలుకు రానున్నట్లు తెలిసింది. ఆ రోజు నవరత్నాల్లో భాగంగా సున్నావడ్డీ పథకం కింద మూడో ఏడాది డ్వాక్రా మహిళల ఖాతాలకు

Updated : 12 Apr 2022 08:00 IST

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22న ఒంగోలుకు రానున్నట్లు తెలిసింది. ఆ రోజు నవరత్నాల్లో భాగంగా సున్నావడ్డీ పథకం కింద మూడో ఏడాది డ్వాక్రా మహిళల ఖాతాలకు నగదు విడుదల చేయనున్నారు. సీఎం పాల్గొనే కార్యక్రమం, పర్యటన షెడ్యూల్‌ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అలాగే గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారైలు ఏర్పాటుచేస్తున్న ఐటీ కంపెనీని కూడా ప్రారంభించే అవకాశముంది. బాలినేనికి కీలక పదవి విషయాన్ని ముఖ్యమంత్రి ఆ రోజు వెల్లడిస్తారని సమాచారం. గతేడాది అక్టోబరు 6న సీఎం ఒంగోలు వచ్చి ‘ఆసరా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాల విభజన తర్వాత తొలిసారి ఇక్కడకు రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని