Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 10 May 2024 12:59 IST

1. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు: చంద్రబాబు

స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘ఆస్తుల దోపిడీయే గానీ.. తరాల మధ్య ప్రేమలను జగన్‌ పట్టించుకోరు. అలాంటి వ్యక్తి కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ చాలా దుర్మార్గమైంది. పూర్తి కథనం

2. కేశినేని నాని ముందే చేతులెత్తేశారు: కేశినేని చిన్ని

పోలింగ్‌కు ముందే విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతులెత్తేశారని ఆయన సోదరుడు, తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. రాజధానిగా అమరావతి వద్దన్న నానికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఎంపీగా పోటీ చేసే నైతిక అర్హత కూడా ఆయనకు లేదన్నారు.పూర్తి కథనం

3. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది.  కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి కథనం

4. పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యల దుమారం

లోక్‌సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న భారతీయుల రూపురేఖలపై శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ (Mani Shankar Aiyar) మరోసారి పార్టీని ఇరుకునపడేశారు.పూర్తి కథనం

5. కాంగ్రెస్‌ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారు: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారని.. 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. పూర్తి కథనం

6. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలే వదిలేస్తా: భాజపా ఎంపీ అర్వింద్‌

ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని భాజపా ఎంపీ అర్వింద్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది.  ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలు ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పతనావస్థకు చేరింది. పూర్తి కథనం

7. ఈడీ ఛార్జ్‌షీట్‌ నిందితుల జాబితాలో ఆప్‌ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్లను నిందితులుగా ప్రస్తావించనుంది. ఈ దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చినట్లవ్వనుంది.పూర్తి కథనం

8. ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్‌..!

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) అభ్యంతరక వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని సదరు మహిళ వెల్లడించిందని జాతీయ మహిళా కమిషన్‌ తెలిపింది.పూర్తి కథనం

9. కొత్త కోచ్‌ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా

భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ వస్తున్నారా..? బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను టీ20 ప్రపంచ కప్‌ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది.పూర్తి కథనం

10. కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే: బండి సంజయ్‌

భారాస ప్రభుత్వంలో కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే అని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని.. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఇక్కడి నేతన్నల దుస్థితికి వాళ్లిద్దరే కారణమన్నారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని