Andhra News: అంగన్‌వాడీ వర్కర్ల అడ్డగింత.. 12గంటలకు పైగా రహదారిపై నిరసన

ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఆవిర్భావ మహాసభకు తరలివెళ్తున్న మహిళల బస్సులను పోలీసులు అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది.

Updated : 24 Apr 2022 10:35 IST

పెళ్లకూరు, న్యూస్‌టుడే: ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఆవిర్భావ మహాసభకు తరలివెళ్తున్న మహిళల బస్సులను పోలీసులు అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో వారు 12గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని మహిళలు విజయవాడలో ఆదివారం నిర్వహించే సభకు ప్రైవేటు బస్సుల్లో తరలివెళ్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో పెళ్లకూరు మండలం చావలి వద్ద జాతీయరహదారి 71పై పోలీసులు బస్సులను ఆపేశారు. దీంతో 150 మందికి పైగా మహిళలు తాగునీరు, భోజనాలకు అవస్థలు పడ్డారు.

దీంతో ఆగ్రహించిన మహిళలు పోలీసులను నిలదీశారు. తామంతా సొంత ఖర్చులతో సభకు వెళ్తుంటే ఆపడం ఏంటని ప్రశ్నించారు. తమను రోడ్డు పక్కన నిలబెట్టడంపై అక్కడే నిరసనకు దిగారు. విజయవాడలో జరిగే సభకు తమను అనుమతించాలని లేనిపక్షంలో ఇక్కడే నిరసన తెలుపుతామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు