Andhra News: 25 మంది మంత్రుల రాజీనామా?

మంత్రిమండలిలోని మొత్తం 25 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత మంత్రిమండలి చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది.

Updated : 07 Apr 2022 10:29 IST

ప్రస్తుత మంత్రిమండలి చివరి భేటీ నేడు
సమావేశమయ్యాక మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం
11న నూతన మంత్రిమండలి ఏర్పాటు

ఈనాడు, అమరావతి: మంత్రిమండలిలోని మొత్తం 25 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత మంత్రిమండలి చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. మంత్రిమండలి సమావేశ ఎజెండాను సిద్ధం చేశారు. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత ప్రక్రియను ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటివరకూ ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదా నలుగురు 11న మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని