Engineering Fee: ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారు

బీటెక్‌కు కనిష్ఠంగా రూ.79,600 గరిష్ఠంగా రూ.1,89,800 ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సిఫార్సు చేసింది. దేశంలోని సాంకేతిక విద్యాసంస్థలన్నింటికీ కనిష్ఠ, గరిష్ఠ బోధన రుసుములను ఏఐసీటీఈ సూచించింది.

Published : 19 May 2022 11:28 IST

  కనీసం రూ.79వేలు, గరిష్ఠం రూ.1.90 లక్షలు

  దేశంలో సాంకేతిక విద్యాసంస్థలకు ఏఐసీటీఈ సిఫార్సు

ఈనాడు, అమరావతి: బీటెక్‌కు కనిష్ఠంగా రూ.79,600 గరిష్ఠంగా రూ.1,89,800 ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సిఫార్సు చేసింది. దేశంలోని సాంకేతిక విద్యాసంస్థలన్నింటికీ కనిష్ఠ, గరిష్ఠ బోధన రుసుములను ఏఐసీటీఈ సూచించింది. ఏఐసీటీఈ అనుబంధ గుర్తింపు ఉన్న ప్రైవేటు సాంకేతిక విద్యాసంస్థలకు బోధన రుసుములను నిర్ణయించేందుకు ఏర్పాటుచేసిన జాతీయ ఫీజుల కమిటీ (ఎన్‌ఎఫ్‌సీ) సమర్పించిన నివేదికను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో 2015లో బోధన రుసుములు నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ గతేడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. దీనిపై రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించి, సమీక్షించేందుకు మరో ఉప కమిటీని నియమించింది. ఇప్పుడు తుది నివేదికను ఏఐసీటీఈ విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని