Singeetam Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావుకు సతీవియోగం

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీమణి లక్ష్మీకల్యాణి కన్నుమూశారు. అనారోగ్యం కారణంతో శనివారం రాత్రి 9.30 గంటలకు చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు.

Updated : 29 May 2022 13:24 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీమణి లక్ష్మీకల్యాణి కన్నుమూశారు. అనారోగ్యం కారణంతో శనివారం రాత్రి 9.30 గంటలకు చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. 1960లో శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిలకు వివాహమైంది. సినిమా స్క్రిప్ట్‌ రాయడంలో భర్తకు ఆమె సహకరించేవారు. ఉపాధ్యాయురాలిగా ఉంటూ పెళ్లయిన తర్వాత కమర్షియల్‌ చిత్రాల హవా నడుస్తున్న సమయంలో మాటలు, పాటలు లేని ‘పుష్పక విమానం’ చిత్రాన్ని సింగీతం తెరకెక్కిస్తున్నప్పుడు అందరూ ‘ఇలాంటి పరిస్థితుల్లో అవసరమా?’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో తప్పకుండా విజయం సాధిస్తుందని వెనక ఉండి నడిపించారామె. తన జీవిత ప్రయాణం గురించి ఆమె ‘శ్రీ కల్యాణీయం’ అనే ఓ పుస్తకాన్ని రాశారు. అందులో దంపతుల మధ్య ప్రేమను చాటిచెప్పారు. లక్ష్మీకల్యాణి చేసే ‘పప్పు’ అంటే ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు ఎనలేని ప్రీతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని