కేవీపీవైలో విశాఖ యువకుడికి మొదటి ర్యాంకు

కేవీపీవై-2022 (కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన) ఫలితాలలో విశాఖ నగరానికి చెందిన వెచ్చ జ్ఞాన మహేష్‌ అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

Published : 25 Jun 2022 05:02 IST

విశాఖపట్నం (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: కేవీపీవై-2022 (కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన) ఫలితాలలో విశాఖ నగరానికి చెందిన వెచ్చ జ్ఞాన మహేష్‌ అఖిలభారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా జ్ఞానమహేష్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ‘కేవీపీˆవై పరీక్ష ద్వారా మన దేశంలోని అగ్రగామి శాస్త్రీయ పరిశోధన సంస్థలలో సీటు వస్తుంది. తద్వారా మంచి శాస్త్రవేత్తగా స్థిరపడవచ్చు. మొదటి ర్యాంకు రావడం వల్ల చదువుకోవడానికి నిధులన్నీ సమకూరుతాయి. పరిశోధన రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. మాది మధ్యతరగతి కుటుంబం. జేఈఈ మెయిన్స్‌లోనూ ఉత్తమ ర్యాంకు కోసం ప్రయత్నిస్తున్నాను’ అని జ్ఞాన మహేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని