రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ శిరోముండనం

రాష్ట్రంలో 25 లక్షల జనాభా ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక వృత్తి దోభీఘాట్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్నూరు చెన్నయ్య డిమాండ్‌ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ గుంటూరు

Published : 28 Jun 2022 05:33 IST

గుంటూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 25 లక్షల జనాభా ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక వృత్తి దోభీఘాట్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చెన్నూరు చెన్నయ్య డిమాండ్‌ చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఆయన శిరోముండనం చేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులను ఎస్సీలుగా గుర్తించడంతో విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని.. రాష్ట్రంలో మాత్రం బీసీల్లో ఉండటంతో అభివృద్ధికి దూరంగా ఉన్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో సమితి నాయకులు దుద్యల సాంబయ్య, ఎల్లరావు, సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని