సీఎం ఇంట రక్షాబంధన్‌ వేడుక

రక్షాబంధన్‌ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి జగన్‌కు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ, సిస్టర్లు పద్మజ, మానస రాఖీలు కట్టారు. సీఎంను

Published : 12 Aug 2022 05:49 IST

ఈనాడు, అమరావతి: రక్షాబంధన్‌ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి జగన్‌కు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ, సిస్టర్లు పద్మజ, మానస రాఖీలు కట్టారు. సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబరులో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. హోం మంత్రిశాఖ తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ,    విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ విజయనిర్మల, రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలా రెడ్డి తదితరులూ ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు.

* రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌శర్మకు ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు సిస్టర్‌ పద్మజ, ఉమ రాఖీలు కట్టారు. మౌంట్‌అబూలో ఈ నెలలో జరగనున్న అడ్మినిస్ట్రేటర్ల సమావేశానికి రావాలని సీఎస్‌ను కోరారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. రక్షా బంధన్‌ అనేది ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అందరు అక్క, చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని