ఏపీ నిట్‌ డైరెక్టర్‌ సీఎస్పీ రావు తొలగింపు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి పేరిట శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో

Published : 24 Sep 2022 04:19 IST

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి పేరిట శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018లో నిట్‌ డైరెక్టర్‌గా నియమితులైన సీఎస్పీ రావుపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై సీబీఐ, ఏసీబీ సంయుక్తంగా విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మార్చి 30న ఆయనను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిట్‌ క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఆరోపణలు నిరూపితం కావడంతో అధికారులు రాష్ట్రపతికి నివేదించారు. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు నాగపుర్‌ విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డా.ప్రమోద్‌ మధుకర్‌ పడోలెను ఏపీ నిట్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. సీఎస్పీ రావును తిరిగి వరంగల్‌ నిట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని