ధాన్యానికి రవాణా ఛార్జీలు ఇవ్వట్లేదు

రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మిన ధాన్యానికి రవాణా ఛార్జీలు చెల్లించడం లేదు. పైపెచ్చు మిల్లర్లు ఒక్కో బస్తాకు 2-3 కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా

Published : 25 Sep 2022 05:25 IST

ఆర్‌బీకేల్లో విజిలెన్స్‌ తనిఖీల్లో గుర్తింపు

ఈనాడు, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మిన ధాన్యానికి రవాణా ఛార్జీలు చెల్లించడం లేదు. పైపెచ్చు మిల్లర్లు ఒక్కో బస్తాకు 2-3 కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రణశాలెం రైతు భరోసా కేంద్రంలో తనిఖీల సందర్భంగా విజిలెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా 50 కేంద్రాల్లో 42 విజిలెన్స్‌ బృందాలు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యవసాయ సాంకేతిక సందేహాల నివృత్తికి ఏర్పాటుచేసిన 155251, టోల్‌ఫ్రీ నంబరు 14400 ప్రదర్శించడం లేదని, పలుచోట్ల ఈ-కేవైసీ కూడా పూర్తికాలేదని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి ఆర్‌బీకేల పనితీరును తెలుసుకున్నామని వివరించారు.

- ఈనాడు, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని