హక్కుల ఉల్లంఘనపై కేసుల విచారణ

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల విచారణతోపాటు నూతనంగా కేసుల స్వీకరణకు ఈనెల 26, 27వ తేదీల్లో క్యాంప్‌...

Published : 27 Sep 2022 05:25 IST

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల విచారణతోపాటు నూతనంగా కేసుల స్వీకరణకు ఈనెల 26, 27వ తేదీల్లో క్యాంప్‌ కోర్టు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మాందాత సీతారామమూర్తి తెలిపారు. జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఛైర్మన్‌ సీతారామమూర్తి, కమిషన్‌ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ జి.శ్రీనివాసరావులు క్యాంప్‌ కోర్టును నిర్వహించారు. 37 కేసులను విచారించగా, 15 కేసులు తుది తీర్పు వెలువరించి పరిష్కరించినట్లు ఛైర్మన్‌ తెలిపారు. రెండు కేసుల్లో తీర్పును రిజర్వు చేశామన్నారు. మరో 20 కేసులను తదుపరి విచారణ కోసం వాయిదా వేశామన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్‌ కార్యదర్శి సంపర వెంకట రమణమూర్తి, క్యాంపు కోర్టు నోడల్‌ అధికారి బొగ్గరం తారక నరసింహకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని