Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌ సిటీకి అత్యుత్తమ ‘ఆతిథ్య’ పురస్కారం

దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవల పురస్కారం రామోజీ ఫిల్మ్‌ సిటీకి దక్కింది.

Updated : 18 Nov 2022 07:40 IST

నేడు బెంగళూరులో ప్రదానం

ఈనాడు, బెంగళూరు: దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవల పురస్కారం రామోజీ ఫిల్మ్‌ సిటీకి దక్కింది. పర్యాటక, ఆతిథ్య రంగాల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న రామోజీ ఫిల్మ్‌ సిటీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దక్షిణ భారత హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ (సిహ్రా) ప్రకటించింది. బెంగళూరులోని షాంగ్రిలా హోటల్‌లో శుక్రవారం నిర్వహించే సమాఖ్య వార్షిక సమ్మేళనంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొని.. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. విశాఖపట్నంలోని నోవోటెల్‌తోపాటు దక్షిణాదికి చెందిన 19 హోటళ్లు, రిసార్ట్‌లకు వివిధ విభాగాల్లో పురస్కారాలను అందిస్తామని నిర్వాహక సంఘం అధ్యక్షుడు కె.శ్యామరాజు వెల్లడించారు. ఈ సమ్మేళన ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు హాజరవుతారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని