నాపై దాడిచేసిన వారిని శిక్షించాలి

ఇంటిని కూల్చి, తనపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ నెల్లూరు జిల్లా చేజర్లకు చెందిన బి.లక్ష్మమ్మ రెండోరోజూ నిరసన కొనసాగించారు.

Published : 25 Nov 2022 04:50 IST

కూల్చివేతకు గురైన ఇంటిముందు వృద్ధురాలి నిరసన

చేజర్ల, న్యూస్‌టుడే: ఇంటిని కూల్చి, తనపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ నెల్లూరు జిల్లా చేజర్లకు చెందిన బి.లక్ష్మమ్మ రెండోరోజూ నిరసన కొనసాగించారు. బుధవారం చేజర్ల పోలీసుస్టేషన్‌ దగ్గర వానలో నిరసన తెలిపిన ఆమె గురువారం తన ఇంటి ముందు కూర్చుని ఆందోళనకు దిగారు. తన వివాహానికి ముందు నుంచి ఉన్న ఇంటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనని అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు వివరించారు. తనపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తన బంధువులను రెచ్చగొట్టి దాడిచేసేలా ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని