సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం: తమ్మినేని సీతారాం

ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పారో తాజాగా సుప్రీంకోర్టు అదే స్పష్టం చేసిందని, శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Updated : 30 Nov 2022 07:24 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి గతంలో ఏం చెప్పారో తాజాగా సుప్రీంకోర్టు అదే స్పష్టం చేసిందని, శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ‘మూడు రాజధానుల విషయంలో హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడే పాలన సాగిస్తోంది. అలాంటిది శాసనసభను శాసనాలు చేయవద్దంటే ఎలా? ఆరు నెలల గడువులో నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పు విని అప్పట్లో బాధపడ్డాం’ అని స్పీకర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని