చాగంటికి గురజాడ పురస్కార ప్రదానం

గురజాడ తన రచనలను సిరాతో రాయలేదని, లోకంలోని కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.

Published : 01 Dec 2022 04:29 IST

ఈనాడు, విజయనగరం: గురజాడ తన రచనలను సిరాతో రాయలేదని, లోకంలోని కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. మహాకవి 107వ వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య బుధవారం విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చాగంటికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీన్ని పురస్కారంగా భావించడం లేదని, ఆశీర్వచనంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ముందుగానే ఫోన్‌లో నిర్వాహకులతో మాట్లాడానని, పురస్కారం రద్దు చేసినా ఫర్వాలేదని, ఆ రోజు ఎవరికిచ్చినా తాను హాజరవుతానని చెప్పానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని