రెండో దశలో ఎంపికైన సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుకు ఆదేశాలు

రాష్ట్రంలో రెండో దశలో (2020-21) ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన వారి ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 02 Dec 2022 05:51 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రెండో దశలో (2020-21) ఎంపికైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన వారి ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రెండో దశలో ఎంపికైన వారిలో దాదాపు 15 వేల మంది ఉద్యోగుల రెండేళ్ల సర్వీసు డిసెంబరు నెలాఖరులోగా పూర్తి కానుంది. వీరి ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ మార్గదర్శకాలు రూపొందించి కలెక్టర్లకు పంపింది. ఈ ప్రకారం ఉద్యోగి విధిగా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు పెండింగ్‌లో ఉండరాదు. అధికారుల పరిశీలనలో ఉద్యోగులపై వ్యక్తిగతంగా ఎలాంటి అభియోగాలూ ఉండకూడదు. శాఖాపరమైన పరీక్షల ఫలితాలు డిసెంబరు 8 నుంచి 14లోగా వెలువడనున్నందున ...ఈలోపు అర్హత కలిగిన ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు నిమిత్తం తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ సంచాలకుడు పేర్కొన్నారు.

ఉద్యోగుల సమస్యలపై వినతి

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలు వెంటనే చేపట్టాలని, వార్డు ఎడ్యుకేషన్‌, డాటా ప్రాసెసింగ్‌, శానిటరీ  కార్యదర్శులతోపాటు ఇతర కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఆధ్వర్యంలో ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాయకులు గురువారం సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌కి వినతి పత్రం అందజేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని