5న అల్పపీడనం

ఈనెల నాలుగో తేదీ నాటికి అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Updated : 02 Dec 2022 05:45 IST

ఏయూ ప్రాంగణం (విశాఖపట్నం), న్యూస్‌టుడే : ఈనెల నాలుగో తేదీ నాటికి అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రం మీద ఈనెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 48 గంటల్లో వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఎనిమిదో తేదీ నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని