నన్ను నిర్బంధించి.. ఆస్తి కాజేశారు

తనను నిర్బంధించి హింసించి.. అక్రమంగా తన ఆస్తిని అమ్మేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వైకాపా అధ్యక్షుడు దేవపై ఓ యువతి ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది.

Updated : 03 Dec 2022 05:58 IST

వైకాపా ఆదోని పట్టణాధ్యక్షుడిపై యువతి ఆరోపణ

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: తనను నిర్బంధించి హింసించి.. అక్రమంగా తన ఆస్తిని అమ్మేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వైకాపా అధ్యక్షుడు దేవపై ఓ యువతి ఆరోపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. నిర్బంధం నుంచి తప్పించుకున్న ఆమె శుక్రవారం స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోనికి చెందిన ఓ యువతికి ఎమ్మిగనూరు రోడ్డులో రూ. 4 కోట్ల విలువైన భూమి ఉంది. వైకాపా పట్టణ అధ్యక్షుడు దేవ ఆ యువతికి ఆమె తల్లి సహకారంతో ఇష్టం లేని పెళ్లి చేశారు. దీంతో కొన్నాళ్లకే ఆమె పుట్టింటికి వచ్చేశారు. అనంతరం దేవ తనను మూడు నెలల పాటు నిర్బంధించి, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తన ఆస్తిని అక్రమంగా వేరేవారికి అమ్మేసి తనతో బలవంతంగా సంతకాలు పెట్టించి రిజిస్ట్రేషన్‌ చేయించాడని బాధితురాలు పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయమై మూడో పట్టణ సీఐ శ్రీరామ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. యువతి ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని