ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బోగస్‌ ఓట్లు

పశ్చిమ, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భారీగా బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని, వాటిని తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, లక్ష్మణరావు, సాబ్జీ వినతిపత్రం సమర్పించారు.

Published : 08 Dec 2022 04:31 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: పశ్చిమ, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భారీగా బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని, వాటిని తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, లక్ష్మణరావు, సాబ్జీ వినతిపత్రం సమర్పించారు. తూర్పు రాయలసీమలో 856 బోగస్‌ ఓట్ల గురించి ఆధారాలు అందజేశారు. నెల్లూరు జిల్లా విద్యాధికారిని, నిజాయతీగా పని చేసిన అనంతపురం డీఈఓ శామ్యుల్‌ను అన్యాయంగా బదిలీ చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కడప జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తొలిదశలో 3,570, కర్నూలులో 1,600 ప్రైవేటు ఓట్లు నమోదయ్యాయని, ఖాళీ దరఖాస్తులపై జిల్లా విద్యాధికారి సంతకాలు పెట్టారని ఎమ్మెల్సీలు వెల్లడించారు. కడపలోని సాయిబాబా ప్రైవేటు పాఠశాలలో 13 మంది టీచర్లు పని చేస్తున్నట్లు పాఠశాల విద్య యూడైస్‌లో నమోదు చేశారని, కానీ, ఆ పాఠశాల పేరుతో 78 మందిని ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. యూడైస్‌వారీగా విచారించి, బోగస్‌ ఓట్లు తొలగించాలని విన్నవించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్నట్లుగా పేర్కొంటూ అనర్హులను సైతం ఓటర్లుగా నమోదు చేశారని, ఆధారాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని