సైబర్‌ నేరగాళ్ల ఖాతాల జప్తు

సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని రూ.27 కోట్ల నిధులను ఈడీ జప్తు చేసింది. ఈ తరహా చర్య చోటుచేసుకోవడం రాష్ట్రంలో తొలిసారి.

Published : 09 Dec 2022 05:07 IST

ఈనాడు డిజిటల్‌, కడప: సైబర్‌ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని రూ.27 కోట్ల నిధులను ఈడీ జప్తు చేసింది. ఈ తరహా చర్య చోటుచేసుకోవడం రాష్ట్రంలో తొలిసారి. మేకింగ్‌ మనీ యాప్‌, ఆర్‌సీసీల పేరిట వైయస్‌ఆర్‌ జిల్లాలో రూ.11 కోట్లను కొల్లగొట్టడంపై గత ఏడాది నవంబరులో కడప ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ‘దర్యాప్తులో భాగంగా తమిళనాడుకు చెందిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసి తదుపరి చర్యల నిమిత్తం ఈడీకి సిఫారసు చేశాం. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల్లోని రూ.27 కోట్లను ఈడీ జప్తు చేసింది’ అని ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని