Andhra News: నిర్మించినవి వదిలేసి.. కొత్తవాటికి పాకులాట!

పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయాలని వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగర సమీపంలో 2006లో 70 ఎకరాల్లో శాటిలైట్‌ సిటీ నిర్మాణం చేపట్టారు.  మొత్తం 3,984 ఇళ్లు నిర్మించాలనేది దీని లక్ష్యం. ఆ మేరకు 1,296 పూర్తి చేశారు.

Updated : 23 Dec 2022 08:54 IST

పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయాలని వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగర సమీపంలో 2006లో 70 ఎకరాల్లో శాటిలైట్‌ సిటీ నిర్మాణం చేపట్టారు.  మొత్తం 3,984 ఇళ్లు నిర్మించాలనేది దీని లక్ష్యం. ఆ మేరకు 1,296 పూర్తి చేశారు. లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన 2,688 ఇళ్లు అసంపూర్తిగా వదిలేశారు. కంప చెట్లు, పొదలు చుట్టేసిన ఆ నిర్మాణాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. దీంతో అక్కడ నివసిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయకుండా.. వాటి పక్కనే జగనన్న కాలనీకి స్థలం కేటాయించింది. అందులో 500 మందికి ఇళ్ల స్థలాలూ చూపింది. కొద్ది నిధులతో వేల మంది ఇంటి కల నెరవేర్చే పనిని వదిలేసి.. జగనన్న కాలనీ పేరిట హడావుడి చేయడమేంటని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని