CM Jagan: ఆయన ఎవరో కాదు.. నా తమ్ముడయ్యా స్వామీ!

‘నా తమ్ముడయ్యా.. స్వామీ..!. ఆయన ఎవరో కాదంటూ...’ సీఎం జగన్‌ మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 27 Dec 2022 09:21 IST

సీఎం జగన్‌ మాట్లాడుతున్న వీడియో వైరల్‌

ఈనాడు డిజిటల్‌, కడప: ‘నా తమ్ముడయ్యా.. స్వామీ..!. ఆయన ఎవరో కాదంటూ...’ సీఎం జగన్‌ మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో మూడు రోజుల పర్యటన పూర్తి చేసుకుని ఆదివారం పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామం ఇది.

ఓ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి రాగా దాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డికి అందజేయమని సీఎం జగన్‌ సూచించారు. అర్జీదారు మాత్రం ముఖ్యమంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించగా ఎంపీని చూపిస్తూ... ‘ఆయనెవరో కాదు.. నా తమ్ముడయ్యా!’ అంటూ ఆ వీడియోలో సీఎం జగన్‌ చెప్పారు. అయితే భద్రతా సిబ్బంది ఎంపీని నిలువరిస్తుంటే సీఎం ఇలా స్పందించారని కూడా ప్రచారం జరుగుతోంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని