Andhra News: స్వామి భక్తికి పరాకాష్ఠ!

స్వామి భక్తికి ఇది పరాకాష్ఠ. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే ధ్రువపత్రాలు, కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇచ్చే ఓపీ చీటీలు ఇలా కాదేదీ ముఖ్యమంత్రి జగన్‌ చిత్రం ముద్రించటానికి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.... చివరికి పోలీసుల డ్యూటీ పాసులను సైతం వదల్లేదు.

Updated : 20 Mar 2023 10:57 IST

పోలీసుల డ్యూటీ పాసులపైనా సీఎం జగన్‌ చిత్రం

ఈనాడు, అమరావతి: స్వామి భక్తికి ఇది పరాకాష్ఠ. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే ధ్రువపత్రాలు, కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇచ్చే ఓపీ చీటీలు ఇలా కాదేదీ ముఖ్యమంత్రి జగన్‌ చిత్రం ముద్రించటానికి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.... చివరికి పోలీసుల డ్యూటీ పాసులను సైతం వదల్లేదు. వాటిపైనా జగన్‌ చిత్రాన్ని ముద్రించి పోలీసు ఉన్నతాధికారులు స్వామి భక్తిని చాటారు. ‘జగనన్న విద్యాదీవెన’ కార్యక్రమంలో భాగంగా సీఎం.. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పర్యటించారు. ఈ బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి... ఆ శాఖ ఉన్నతాధికారులు డ్యూటీ పాసులు జారీ చేశారు. వాటిపై భాగంలో సీఎం జగన్‌ చిత్రాన్ని ముద్రించారు. ఇలా డ్యూటీ పాస్‌లపైనా సీఎం బొమ్మ ముద్రించటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం బొమ్మతో పాసులు జారీ చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ, ఎక్కడా లేదని, తొలిసారి చూస్తున్నామని కొంతమంది పోలీసు సిబ్బంది వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు