TTD - Tirumala: ఆ భక్తులకు శ్రీవారి సేవల భాగ్యం దూరమే

కొవిడ్‌ సమయంలో శ్రీవారి సేవాటికెట్లను ముందస్తుగా నమోదు చేసుకుని ఆ భాగ్యం పొందలేని భక్తుల కోసం రీషెడ్యూల్‌ చేసి ఆ సేవలకు అనుమతించలేమని తితిదే అధికారులు స్పష్టం చేశారు.

Updated : 14 May 2023 08:10 IST

కొవిడ్‌ సమయంలో సేవలకు నమోదు చేసుకున్న వారికి నిరాశే

ఈనాడు, తిరుపతి: కొవిడ్‌ సమయంలో శ్రీవారి సేవాటికెట్లను ముందస్తుగా నమోదు చేసుకుని ఆ భాగ్యం పొందలేని భక్తుల కోసం రీషెడ్యూల్‌ చేసి ఆ సేవలకు అనుమతించలేమని తితిదే అధికారులు స్పష్టం చేశారు. వారు బ్రేక్‌ దర్శనానికి రావచ్చని సూచించారు. కొవిడ్‌ సమయంలో 2020 మార్చి 20 నుంచి 2021 ఏప్రిల్‌ 13 వరకు భక్తులను సేవలకు అనుమతించలేదు. స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సమయంలో శ్రీవారి సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం, తిరుప్పావడ, వసంతోత్సవం, విశేష పూజ, నిజపాద దర్శనం సేవలను చూసేందుకు 17,946 మంది భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్నారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు అవకాశం లభిస్తుందని నిరీక్షిస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ సేవలకు వారిని అనుమతించలేమని అధికారులు పేర్కొన్నారు. బ్రేక్‌ దర్శనం లేదా సొమ్మును వాపసు తీసుకోవచ్చని సూచించారు. ఇందులో భాగంగా సుమారు 8965 మంది బ్రేక్‌ దర్శనం చేసుకోగా.. 8,717 మంది ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని