పోలీసుల వేధింపులు ఆపాలి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆ సంఘం (ఏపీజీఈఏ) ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 05 Jun 2023 05:25 IST

ఏపీజీఈఏ ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు

విజయవాడ (పటమట), న్యూస్‌టుడే: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆ సంఘం (ఏపీజీఈఏ) ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు ఎవరి ప్రోద్బలంతో తమను వేధిస్తున్నారో తెలియడం లేదని వివరించారు. ఇప్పటికే నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను అరెస్టు చేశారని, ఐదో వ్యక్తిగా తమ సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణను చేర్చారని తెలిపారు. సూర్యనారాయణ శుక్రవారం నుంచి తమతో లేకపోయినా తమ సంఘం సభ్యుల ఇళ్లకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారని, దాంతో కుటుంబసభ్యులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. సోమవారం నుంచి విజయవాడలో ఉంటానని, విచారణకు సహకరిస్తామని, తమపై పోలీసుల వేధింపులు ఆపాలని కోరారు.

*  కె.ఆర్‌.సూర్యనారాయణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు