వెనక్కి వచ్చిన రాజమహేంద్రవరం విమానం

వాతావరణం అనుకూలించక శంషాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం బయల్దేరిన విమానం తిరిగి వెనక్కి వచ్చింది.

Published : 05 Jun 2023 06:47 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: వాతావరణం అనుకూలించక శంషాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం బయల్దేరిన విమానం తిరిగి వెనక్కి వచ్చింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌ రాజమహేంద్రవరం బయల్దేరగా ప్రతికూల వాతావరణంతో అక్కడి ఎయిర్‌పోర్ట్‌ ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. ఆ విమానం రాత్రి 10.15 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది.

ల్యాండ్‌ అయినా డోర్‌ తీయలేదు: విమానం ఎయిర్‌పోర్టుకు వచ్చినా కిందకు దిగేందుకు ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తిరుపతి నుంచి ప్రయాణికులతో శంషాబాద్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌ బయల్దేరింది. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్‌ అయింది. ప్రయాణికులు కిందకు దిగడానికి ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ఏర్పాట్లు చేయలేదు. గంట పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని