ఏమీ లేనిచోట ఇదే సంతోషం

గ్యారెంటీడ్‌ పింఛను పథకం (జీపీఎస్‌)పై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Published : 08 Jun 2023 05:12 IST

జీపీఎస్‌పై ఏపీ ప్రభుత్వ  ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్య

ఈనాడు, అమరావతి: గ్యారెంటీడ్‌ పింఛను పథకం (జీపీఎస్‌)పై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘సీపీస్‌ ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్‌ తీసుకురావడం సంతోషదాయకం. 50 శాతం పింఛను ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఏమీ లేని చోట ఏదో ఒకటి రావడం సంతోషమే కదా. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలకు అనుగుణంగా కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు’ అని వెల్లడించారు.

ముఖ్యమంత్రికి ఉద్యోగుల అభివాదం: సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ అమలుకు, 2014 నాటికి అయిదేళ్ల సర్వీసున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి తన సహచరులు, కొందరు ఉద్యోగులతో సచివాలయం రెండో బ్లాకు ముందు వేచి ఉన్నారు. కేబినెట్‌ భేటీ ముగిశాక సీఎం వాహనశ్రేణి రెండో బ్లాకు ముందుకు రాగానే అక్కడున్న ఉద్యోగులు ముఖ్యమంత్రికి అభివాదం చేస్తూ నినదించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని