వాలంటీర్లు విలవిల

సీఎం పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలోని అధికారులు, సామాన్యులు, వాలంటీర్లకూ ఇక్కట్లు తప్పడం లేదు.

Published : 11 Aug 2023 04:52 IST

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సీఎం పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలోని అధికారులు, సామాన్యులు, వాలంటీర్లకూ ఇక్కట్లు తప్పడం లేదు. శుక్రవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి సీఎం వస్తున్న నేపథ్యంలో వాలంటీర్లకు విధులు కేటాయించారు. హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలి వరకు సుమారు 350 మంది వాలంటీర్లను పహారాగా ఉంచారు. ప్రతి 10 మీటర్లకు ఒకరుండేలా ఏర్పాట్లు చేశారు. గురువారం వారికి కేటాయించిన ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళా వాలంటీర్లు ఎండలో నిల్చోలేక విలవిల్లాడారు. తలపై చున్నీలతో ఉపశమనం పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు