Nagayalanka: ఎండిన పొలంలో వెక్కివెక్కి ఏడ్చిన రైతు

కంటిపాపలా చూసుకున్న పంట నీరులేక ఎండిపోతుంటే ఆ రైతు తల్లడిల్లిపోయాడు. ప్రభుత్వ ప్రతినిధులెవరూ ఆ వైపు రాకపోగా.. పైనుంచి సాగునీటి కొరతే లేదంటుంటే మౌనంగా రోదించాడు.

Updated : 19 Oct 2023 07:41 IST

నాగాయలంక, అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: కంటిపాపలా చూసుకున్న పంట నీరులేక ఎండిపోతుంటే ఆ రైతు తల్లడిల్లిపోయాడు. ప్రభుత్వ ప్రతినిధులెవరూ ఆ వైపు రాకపోగా.. పైనుంచి సాగునీటి కొరతే లేదంటుంటే మౌనంగా రోదించాడు. బుధవారం మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అటువైపు వెళ్లగా ఆ రైతు దుఖం కట్టలు తెంచుకుంది. బీడువారిన పొలాన్ని చూపుతూ ఒక్కసారిగా బోరుమన్నాడు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో తెదేపా, జనసేన శ్రేణులతో కలిసి మండలి బుద్ధప్రసాద్‌ ఎండిపోయిన పొలాలను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధిత రైతు గోవిందరాజును ఓదార్చిన బుద్ధప్రసాద్‌ అనంతరం మాట్లాడారు. ‘దివిసీమలో సాగునీటి సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కనీసం పెదవి విప్పకపోవడం శోచనీయం. అధికారులూ కాల్వలు, పంట పొలాలను పరిశీలించడం లేదు. గతంలో ఇలాంటి ఇబ్బందులు వస్తే ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగి నీటి సరఫరా చేసేవాళ్లు. ప్రాజెక్టుల్లో నీరు లేకపోతే ప్రభుత్వం పట్టిసీమ నుంచి ఇచ్చేది. దివిసీమలో సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రెండు రోజుల్లో సొర్లగొంది ఆయకట్టు నుంచే ఆందోళనకు దిగుతాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు