Ram Gopal Varma: బెడిసికొట్టిన ‘వ్యూహం’

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రచించిన ‘వ్యూహం’ బెడిసికొట్టింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం ‘వ్యూహం’ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని భారీగా ఏర్పాట్లు చేశారు.

Updated : 24 Dec 2023 09:24 IST

ఈనాడు, అమరావతి: దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Ram Gopal Varma) రచించిన ‘వ్యూహం’ (Vyuham) బెడిసికొట్టింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శనివారం సాయంత్రం ‘వ్యూహం’ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని భారీగా ఏర్పాట్లు చేశారు. వేలాదిమంది కూర్చుని తిలకించేందుకు మైదానం మొత్తం కుర్చీలను వేశారు. భారీ సెట్టింగులతో హడావుడి చేశారు. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటన్నట్టుగా పరిస్థితి మారింది. కనీసం వందల సంఖ్యలోనూ అభిమానులు లేకపోవడంతో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించాల్సిన వేడుకను రాత్రి 8 గంటల వరకూ మొదలు పెట్టలేకపోయారు. తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వ్యూహం బెడిసికొట్టింది. దీంతో ఎలాగైనా వేడుకకు జనాన్ని తీసుకురావాలని వైకాపా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆటోలు, కార్లను పెట్టి జనాన్ని తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ వారు గంటల కొద్ది వేచి ఉండలేక వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు కనిపించకుండా ఉండేందుకు స్టేడియంలోని లైట్లన్నింటినీ ఆర్పేసి చీకటిలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి మమ అనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని