Ashok Gajapathi Raju: సంపన్న కుటుంబంలో పుట్టి.. సామాన్య ప్రయాణికుడిలా..

తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరంలోని గజపతుల బంగ్లాలో ఉంటున్నప్పటికీ సామాన్యులతోనే ఎక్కువగా తిరుగుతుంటారు.

Updated : 11 Jan 2024 07:50 IST

తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరంలోని గజపతుల బంగ్లాలో ఉంటున్నప్పటికీ సామాన్యులతోనే ఎక్కువగా తిరుగుతుంటారు. వ్యక్తిగత పనిమీద సోమవారం ఆయన తన సతీమణి సునీలా గజపతిరాజు, ఇతర కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ పయనమయ్యారు. అక్కడినుంచి రైలులో మహారాష్ట్ర వెళ్లేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇలా రైలు కోసం ప్లాట్‌ఫారంపై ఎదురుచూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని