ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్‌ పప్పు వేణుగోపాలరావు కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, రచయిత డాక్టర్‌ పప్పు వేణుగోపాలరావు(75) గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలోని మలర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 10 Apr 2024 04:28 IST

ముగిసిన అంత్యక్రియలు

చెన్నై(వడపళని), న్యూస్‌టుడే: ప్రముఖ విద్యావేత్త, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, రచయిత డాక్టర్‌ పప్పు వేణుగోపాలరావు(75) గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలోని మలర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంగళవారం బీసెంట్నగర్‌లో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 1948 జూన్‌ 30న జన్మించిన వేణుగోపాలరావు ఎమ్మార్‌ కళాశాలలో ఇంగ్లిష్‌, తెలుగు, సంస్కృతంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. అనంతరం తెలుగు, సంస్కృతంలో డాక్టరేట్‌ పొందారు. విశాఖపట్నం ఏవీఎన్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేశారు. 1980 నుంచి ‘అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియన్‌ స్టడీస్‌’లో ఉద్యోగంలో చేరి 2008లో దక్షిణ భారత ప్రాంతానికి ‘అసోసియేట్ డైరెక్టర్‌ జనరల్‌’గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆంగ్ల దినపత్రిక ది హిందూలో పుస్తకాలపై సమీక్షలు రాసేవారు. కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యంపై అనేక ప్రసంగాలు చేశారు. తెలుగు, సంస్కృత భాషల్లో నిర్వహించిన అష్టావధానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత సభ మ్యూజిక్‌ అకాడమీకి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని