రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు

జగన్‌ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ అన్నారు.

Published : 01 May 2024 05:50 IST

అప్పుడు ఒవైసీ ఎందుకు స్పందించలేదు
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: జగన్‌ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌ షిబ్లీ అన్నారు. ముస్లింలకు తీవ్ర అవమానాలు, అన్యాయాలు జరిగాయన్నారు. అలాంటి విపత్కర సమయంలో మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విజయవాడ మొగల్రాజపురంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ స్పందించని అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికలు సమీపించడంతో చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. వాటిని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రా ముస్లింలు లేరని షిబ్లీ అన్నారు. మీకు జగన్‌ మిత్రుడైతే ఇద్దరూ కలిసి టెన్నిస్‌, క్రికెట్‌ ఆడుకోవాలని, అంతేగానీ ఆంధ్రుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. జగన్‌ భాజపాకు లోపాయికారిగా మద్దతు తెలియజేస్తున్నారనే సంగతి గుర్తించాలని ఒవైసీకి సూచించారు. నిజమైన సెక్యులర్‌ చంద్రబాబు అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని