ITR: 31 లక్షల మంది రిఫండ్లకు దూరం.. ఇ-వెరిఫై చేయని ఫలితం!

Income Tax Refund: ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. కొందరు మాత్రం ఇ-వెరిఫై చేయటం మరచిపోయారు. అలాంటి వారిని అప్రమత్తం చేస్తూ ఐటీశాఖ ట్వీట్ చేసింది. 

Updated : 24 Aug 2023 17:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత 30 రోజుల్లోగా ఇ-వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. అప్పుడే ఐటీ శాఖ రిటర్నులను ప్రాసెస్‌ చేస్తుంది. ఈ ఏడాది చాలా మంది రిటర్నులు దాఖలు చేసినా.. లక్షల సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఇ-వెరిఫై చేయడం మరిచిపోయారు. దీంతో వీరికి రిఫండ్‌ సొమ్ము ఖాతాల్లోకి జమ ఆలస్యం కానుంది. ఆగస్టు 23 నాటికి 31 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఇ- వెరిఫై చేయలేదని ఐటీ శాఖ వెల్లడించింది.

ఆదాయ పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23 నాటికి 6.91 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. అందులో 6.59 కోట్ల మందికి మాత్రమే తమ రిటర్నులను ఇ-వెరిఫై చేశారు. ఇంకా 31 లక్షల మంది వెరిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆదాయ పన్ను శాఖ రిటర్ను దాఖలు చేసిన వారిని అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్ చేసింది. ‘మీ ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్‌ను ఈ రోజే పూర్తి చేయండి. రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోగా వెరిఫికేషన్‌ చేయకపోతే ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం వద్దు’ అంటూ అప్రమత్తం చేసింది. 30 రోజుల్లోపు ఇ-వెరిఫికేషన్‌ పూర్తిచేయకుంటే రిఫండ్లు ఆలస్యం అవ్వడమే కాకుండా రిటర్నులను సైతం ఇన్‌వ్యాలీడ్‌గా పరిగణిస్తారు. వెరిఫికేషన్‌ ఆలస్యం చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 140 km

ఇ-వెరిఫికేషన్ ఇలా..

  •  ‘Income Tax e-filing’ పోర్ట్‌లోకి వెళ్లి అకౌంట్‌లో లాగిన్‌ అవ్వాలి. 
  •  ‘e-Verify Return’ ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  •  మీ ఆధార్‌కి లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇ- వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని