TVS Motor: టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 140 km

TVS e-scooter: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ రెండో విద్యుత్తు స్కూటర్‌ను బుధవారం లాంచ్‌ చేసింది. కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో ఉన్న ఈ స్కూటర్‌ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూమ్‌లో రూ.2.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.

Updated : 24 Aug 2023 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో రెండో మోడల్‌ను బుధవారం లాంచ్ చేసింది. టీవీఎస్‌ ఎక్స్ (TVS X) పేరుతో కొత్త ప్రీమియం ఇ-స్కూటర్‌ను (e-scooter) అందుబాటులోకి తెచ్చింది. నేవిగేషన్‌ సిస్టం, ఈవీ ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజమ్‌, లైవ్‌ వెహికల్‌ లొకేషన్ షేరింగ్‌ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. అల్యూమినియం బాడీతో ఉండే ఈ విద్యుత్తు వాహనం ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.2.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించామని.. నవంబరులో డెలివరీలు చేయనున్నాయని టీవీఎస్‌ పేర్కొంది. 

ఇక ఈ వాహనం ఫీచర్ల విషయానికొస్తే.. టీవీఎస్ ఎక్స్ స్కూటర్ 3.8 kWh బ్యాటరీతో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 3 kW ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే కేవలం గంట వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక స్కూటర్‌ భద్రత కోసం నెక్ట్స్‌-జెనరేషన్‌ ABS కూడా ఇచ్చారు. స్టెల్త్, ఎక్స్‌ట్రైడ్‌, ఎక్సోనిక్‌ మోడ్స్‌ ఉన్నట్లు టీవీఎస్‌ తెలిపింది.  

అంతరిక్ష వాణిజ్యంలో భారత ముద్ర

ఈ స్కూటర్ కొనుగోలులో భాగంగా 950W పోర్టబుల్‌ ఛార్జర్‌ను రూ.16,275కే అందిస్తామని కంపెనీ తెలిపింది. 3-KW స్మార్ట్ హోమ్ ఛార్జర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. వెల్‌నెస్, గేమింగ్, బ్రౌజింగ్, లైవ్ వీడియో ఫీచర్‌లను అందించే ప్లే టెక్‌తో ఈ స్మార్ట్ స్కూటర్ వస్తోంది. ఈ ‘TVS X’ ను స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, హెల్మెట్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఇతరులు యాక్సెస్‌ చేయకుండా ఉండేందుకు స్మార్ట్ షీల్డ్‌ భద్రతా ఫీచర్‌ కూడా దీనిలో ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని