గృహరుణం మార్చుకోవచ్చా?
నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.28 వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.7 వేలను పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి?
నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.28 వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.7 వేలను పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి?
మధుకర్
చిన్న వయసులోనే బీమా తీసుకుంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ వస్తుంది. కాబట్టి, మీపై ఆధారపడిన వారుంటే మీ వార్షికాదాయానికి కనీసం 12 రెట్ల వరకూ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత బీమా పాలసీ తీసుకోండి. దీంతోపాటు ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే అత్యవసర నిధిని సమకూర్చుకోండి. ఇవన్నీ పూర్తయ్యాకే పెట్టుబడుల గురించి ఆలోచించండి. రూ.7వేలలో రూ.3వేలను ప్రజా భవిష్య నిధిలో జమ చేయండి. మిగతా రూ.4వేలను క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి.
రూ.35 లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడంతో అర శాతం తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు మారేందుకు ప్రయత్నిస్తున్నాను. రుణం మరో రూ.7 లక్షలు అధికంగానే వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి ఆలోచనేనా
వెంకట్
ఏడాది కాలంగా గృహరుణ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇవి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకుకు మారే అవకాశాన్ని పరిశీలించవచ్చు. కానీ, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర రుసుములను చూసుకోవాలి. తగ్గిన వడ్డీ ప్రయోజనం వీటికన్నా అధికంగా ఉండాలి. అప్పుడే ప్రయోజనం. అదనంగా రూ.7 లక్షలు తీసుకొని, ఏం చేస్తారు అన్నది ఇక్కడ ప్రధానం. మీకు డబ్బుతో అవసరం లేకపోతే అధిక రుణం తీసుకోవద్దు. దీనివల్ల వడ్డీ భారం తప్ప ఫలితం ఉండదు.
మా అబ్బాయి వయసు 12. మరో 9 ఏళ్ల తర్వాత తనను అమెరికా పంపాలనుకుంటున్నాం. ఇందుకోసం ఇప్పటి నుంచే నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం ఏం చేయాలి?
ఆదిత్య
మీ అబ్బాయిని అమెరికా పంపించేందుకు ఇప్పటి నుంచే పెట్టుబడులు ప్రారంభించడం మంచి ఆలోచన. మీకు 9 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి, అమెరికా ద్రవ్యోల్బణం, డాలరు విలువ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో కనీసం 60-70 శాతం అమెరికా ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. మిగతా 40 శాతాన్ని ఇక్కడి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసుకోవాలి. మీకు డబ్బులు అవసరమైన రెండేళ్ల ముందు నుంచీ ఈక్విటీ పెట్టుబడులు తగ్గించుకోవాలి. ఫీజు చెల్లించే సమయానికి మొత్తం డబ్బును సురక్షితమైన పథకాల్లోకి మళ్లించాలి. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు.
తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్