RBI: బ్యాంకర్లూ.. జాగ్రత్తగా ఉండండి: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ ఉండాలని, వాటి వల్ల బ్యాలెన్స్‌ షీట్లపై ప్రభావం తక్కువగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు...

Updated : 17 Nov 2022 09:22 IST

ముంబయి: అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ ఉండాలని, వాటి వల్ల బ్యాలెన్స్‌ షీట్లపై ప్రభావం తక్కువగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని బ్యాంకుల అధిపతులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. కొవిడ్‌ సంక్లిష్ట సమయాల్లో, ప్రస్తుత అనిశ్చితిలో దేశ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇచ్చే కీలక పాత్రలో వాణిజ్య బ్యాంకులు రాణించాయని ఆయన కితాబునిచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలతో పాటు కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల అధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం.కె. జైన్‌తో పాటు కొంత మంది సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. రుణ వృద్ధితో పోలిస్తే డిపాజిట్ల వృద్ధి తక్కువగా ఉండడం, ఆస్తుల నాణ్యత, ఐటీ మౌలిక వసతుల్లో పెట్టుబడులు, కొత్త తరం సాంకేతిక పరిష్కారాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల పనితీరు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని