రికార్డు గరిష్ఠానికి రిలయన్స్‌ షేరు

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు జీవనకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో ఒకదశలో రూ.2,837.45 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు, చివరకు 0.93 శాతం లాభపడి రూ.2,820.45 వద్ద ముగిసింది.

Published : 19 Jul 2023 05:26 IST

అత్యంత విలువైన ఆసియా కంపెనీల్లో 8వ స్థానం

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు జీవనకాల గరిష్ఠ ముగింపును నమోదు చేసింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో ఒకదశలో రూ.2,837.45 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు, చివరకు 0.93 శాతం లాభపడి రూ.2,820.45 వద్ద ముగిసింది. ఈ షేరుకిదే రికార్డు ముగింపు కావడం విశేషం. 21న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాలు వెలువరించనుంది. ఇక 20న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ఆర్థిక సేవల విభాగం విడిపోయి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌గా స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు పరుగులు తీస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19.1 లక్షల కోట్లు (232.8 బిలియన్‌ డాలర్లు)గా నమోదైంది. 200 బి.డాలర్ల మార్కెట్‌ విలువను అధిగమించిన ఏకైన భారత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనసాగుతోంది. ప్రపంచంలో విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్‌ 42వ స్థానంలో ఉంది. టయోటా, మెక్‌డొనాల్డ్స్‌, ఆస్ట్రాజెనెకా, సిస్కో, షెల్‌ వంటి కంపెనీల కంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముందు స్థానాల్లో ఉంది. ఆసియా కంపెనీల్లో 8వ విలువైన కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. సౌదీ అరామ్‌కో, టీఎస్‌ఎంసీ, టెన్సెంట్‌, క్విచో మైటాయ్‌, అలీబాబా, శామ్‌సంగ్‌, ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ వంటి దిగ్గజాలు రిలయన్స్‌ కంటే ముందు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని