Q-A: గృహరుణం మార్చుకోవచ్చా?
ఏడాది క్రితం రూ.25లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడంతో అర శాతం తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు మారేందుకు ప్రయత్నిస్తున్నాను.
* ఏడాది క్రితం రూ.25లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడంతో అర శాతం తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుకు మారేందుకు ప్రయత్నిస్తున్నాను. రుణం మరో రూ.5 లక్షలు అధికంగానే వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి ఆలోచనేనా? - ప్రసాద్
గత ఏడెనిమిది నెలలతో పోలిస్తే గృహరుణం వడ్డీ రేట్లు ఇప్పుడు బాగా పెరిగాయి. మరో రెండు మూడు నెలలు ఇదే ధోరణి కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడున్న మార్కెట్ రేటుకంటే అర శాతం తక్కువ మంచిదే. కానీ, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర రుసుములనూ చూసుకోవాలి. అవి అధికంగా ఉంటే.. బ్యాంకు మారడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. అదనంగా తీసుకునే మొత్తాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అన్నదీ ముఖ్యమే. ఈ మొత్తాన్ని మీరు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉంటే.. అది మంచిది కాదు. మీకు అవసరం ఉన్నంత మేరకే కొత్త బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం మేలు.
* మా అబ్బాయి వయసు 14. మరో 8 ఏళ్ల తర్వాత తనను అమెరికా పంపాలనుకుంటున్నాం. ఇందుకోసం ఇప్పటి నుంచే నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం ఏం చేయాలి? - ప్రభాకర్
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించే అవకాశాలు అధికంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు కొనసాగించాలి. మీకు అధిక రాబడి రావాలంటే.. మీ పెట్టుబడిలో రూ.10వేలను అమెరికా మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని ఇక్కడి స్టాక్ మార్కెట్ ఆధారిత డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. అయిదేళ్ల తర్వాత నష్టభయం ఉన్న పథకాల నుంచి కాస్త సురక్షిత పథకాల్లోకి పెట్టుబడిని మార్చుకోండి.
* నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.18వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.8వేలను పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా ప్రణాళిక ఎలా ఉండాలి? - అనిల్
చిన్న వయసు నుంచే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగించే వ్యూహంతో మీరు అడుగులు వేయాలి. ముందుగా మీపై ఆధారపడిన వారుంటే.. కనీసం రూ.25 లక్షల విలువైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోండి. ఇవన్నీ పూర్తయ్యాకే పెట్టుబడుల గురించి ఆలోచించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.8వేలలో రూ.3వేలను దీర్ఘకాలిక దృష్టితో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో జమ చేయండి. మిగిలిన రూ.5వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టండి.
- తుమ్మ బాల్‌రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మాయి చదువుకు భరోసాగా
మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. -
వెండిలో మదుపు లాభమేనా?
నాలుగేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నాను. అసలు ఇంకా రూ.30 లక్షల వరకూ ఉంది. ఏడాదికి ఒకటి రెండు ఈఎంఐలు అధికంగా చెల్లించడం మంచిదేనా? లేదా రూ.1లక్ష చెల్లించాలా? -
నెలకు రూ.45వేలు వచ్చేలా
మరో 20 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాను. ఆ తర్వాత నెలకు కనీసం రూ.45 వేల పింఛనులాగా వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. -
పింఛను పాలసీ తీసుకోవచ్చా?
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్లు కాస్త అధిక రాబడిని ఇచ్చే మాట వాస్తవమే. కానీ, పెద్ద కంపెనీలు, క్రెడిట్ రేటింగ్ బాగున్న వాటినే ఎంచుకోవాలి. -
పదవీ విరమణలో తోడుగా
నా వయసు 57. మరో మూడేళ్లలో పదవీ విరమణ చేస్తాను. పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు నెలకు రూ.40 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను -
కొత్త టర్మ్ పాలసీ తీసుకోవచ్చా?
ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉన్నాయి. మీకు వచ్చిన మొత్తంలో రూ.6 లక్షలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. నెలనెలా వడ్డీ తీసుకునేందుకు వీలుగా నాన్ క్యుములేటివ్ డిపాజిట్ చేయండి. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచివేనా?
నెలకు రూ.8,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కనీసం 10 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తాను -
పదవీ విరమణ నిధి కోసం...
నా వయసు 56. మరో నాలుగేళ్లలో పదవీ విరమణ చేస్తాను. కొంత కాలంగా పసిడి మంచి లాభాలను ఇస్తోంది కదా. -
ఇప్పుడు ఇల్లు కొనొచ్చా?
నేను ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 8.75 శాతం వరకూ ఉన్నాయి కదా! ఇల్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా? -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్‌ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
సొంత పాలసీ తీసుకోవాలా?
ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి...
నా వయసు 25. నెలకు రూ.30వేల వరకూ వేతనం వస్తోంది. ఇందులో నుంచి రూ.12వేల వరకూ కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేయాలని ఆలోచన. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? -
బంగారంలో మదుపు చేయాలంటే...
మా అమ్మాయి వయసు 13. తన అవసరాల కోసం బంగారంలో మదుపు చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయగలం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? -
18 శాతం రాబడి వస్తుందా?
నెలకు రూ.30 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 18 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా? -
డెట్ ఫండ్లలో అధిక రాబడి వస్తుందా?
నా వయసు 28. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? నేను చిరు వ్యాపారిని. పాలసీ తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం అవుతాయా? -
నేరుగా షేర్లలో మదుపు చేస్తే...
నెలకు రూ.7,000 చొప్పున షేర్లలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాను. మంచి రాబడి వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి -
నెలకు రూ.30వేలతో
౯ మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.30 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన మదుపు పథకాలేమున్నాయి? -
అమెరికా ఫండ్లలోనూ మదుపు
నా వయసు 44. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.10,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది. -
12 ఏళ్లలో రూ.70 లక్షలు..
రెండు నెలల్లో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.2లక్షల వరకూ వెనక్కి వస్తున్నాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్‌లో రైల్ నెట్‌వర్క్‌పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు