Q-A: రాబడిపై పన్ను లేకుండా...
నా వయసు 62. రూ.5 లక్షలను స్థిరాదాయం ఇచ్చే డిపాజిట్లలో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్ పొదుపు పథకంతో పోలిస్తే.. బ్యాంకుల్లో అధిక వడ్డీ వస్తుంది కదా. రెండింటిలో ఏది మేలు?
- నా వయసు 62. రూ.5 లక్షలను స్థిరాదాయం ఇచ్చే డిపాజిట్లలో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్ పొదుపు పథకంతో పోలిస్తే.. బ్యాంకుల్లో అధిక వడ్డీ వస్తుంది కదా. రెండింటిలో ఏది మేలు?
-రాధాకృష్ణ
ఈ ఏడాది ఏప్రిల్ వరకూ వడ్డీ రేట్లు చాలా తక్కువగానే ఉండేవి. కానీ, ఈ మధ్య కాలంలో ఆర్‌బీఐ రెపో రేటు పెంచుతూ వస్తోంది. దీంతో అటు రుణాలపైనా, ఇటు డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు 3-5 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 6.50 - 7.00 శాతం మధ్యలో వడ్డీనిస్తున్నాయి. కొన్ని కొత్తతరం చిన్న ప్రైవేటు బ్యాంకుల్లో 7.5శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో 7.6 శాతం వడ్డీ అందుతోంది. అయిదేళ్ల వ్యవధి ఉండే ఈ పథకంలో ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. ఇది పూర్తిగా సురక్షితమైన పథకం. కాబట్టి, మీరు ఈ పథకంలోనే మీ డబ్బును జమ చేయడం ఉత్తమం.
- నేను 30 శాతం పన్ను శ్లాబు పరిధిలో ఉన్నాను. కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. రాబడికి హామీ ఉంటూ, వచ్చిన మొత్తంపై పన్ను పడకుండా ఉండాలంటే ఎలాంటి పెట్టుబడి పథకాలు ఎంచుకోవాలి?
-శంకర్
మీ ఈపీఎఫ్ ఖాతాలో జమ రూ.2,50,000లకు తక్కువగా ఉంటే.. మీరు పెట్టాలనుకుంటున్న పెట్టుబడిని వీపీఎఫ్‌లో జమ చేయండి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని సురక్షితమైన పథకాలతో పోలిస్తే ఇదే అధిక వడ్డీనిస్తోంది. పెట్టుబడి రూ.2,50,000 మించితే.. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఎంచుకోవచ్చు. ఇందులో 7.1 శాతం రాబడి లభిస్తోంది. 15 ఏళ్లపాటు కొనసాగించాలి. ప్రత్యామ్నాయంగా కాస్త నష్టభయం భరించగలను అనుకుంటే హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి. వీటిలో ఏడాదికి మించి పెట్టుబడిని కొనసాగిస్తే దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాలిక మూలధన లాభం లభిస్తే.. ఆ పై మొత్తంపై 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
- మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. ఈక్విటీ ఆధారిత ఫండ్లు మంచివా? నిఫ్టీ ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లను ఎంచుకోవచ్చా?
-ప్రవీణ్
మీకు కనీసం 5-7 ఏళ్ల సమయం ఉంటే.. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవాలి. పెట్టుబడి మొత్తంలో 15 శాతాన్ని నిఫ్టీ ఈటీఎఫ్‌లకు కేటాయించండి. రెండు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో 60 శాతం, మిడ్ క్యాప్ ఫండ్‌లో 15 శాతం, స్మాల్ క్యాప్ ఫండ్‌లో 10 శాతం పెట్టుబడులు ఉండేలా చూసుకోండి.
- మా అమ్మాయి వయసు 8. తన పేరుమీద సుకన్య సమృద్ధి యోజన, బీమా పాలసీలు తీసుకోవాలని అనుకుంటున్నాం. దీనికోసం నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయగలం. ఇది మంచిదేనా?
-శ్రావణి
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్ అవసరాలకు రక్షణ కల్పించేందుకు కుటుంబ పెద్దపైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలలో సగాన్ని సుకన్య సమృద్ధి పథకంలో జమ చేయండి. మిగతా రూ.5వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. సగటున 10.5శాతం వార్షిక రాబడి అంచనాతో 10 ఏళ్ల తర్వాత రూ.19,58,950 అయ్యేందుకు అవకాశం ఉంది.
-తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి
-
General News
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల
-
World News
Pakistan: పోలీసు యూనిఫాంలో వచ్చి.. మారణహోమం సృష్టించి..!
-
Sports News
INDW vs SAW: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్ ఓటమి..