Q-A: ఉమ్మడి పాలసీ తీసుకోవచ్చా?
ముందుగా మీ అబ్బాయిల భవిష్యత్ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపైన మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత బీమా పాలసీని తీసుకోండి.
* మా ఇద్దరు అబ్బాయిల పేరుమీద నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. దీనికోసం నేను కొన్ని కంపెనీల షేర్లను ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఇది మంచిదేనా? కనీసం 12 ఏళ్ల వరకూ పెట్టుబడి పెట్టేందుకు మంచి పథకాలేమున్నాయి?
- రాజేంద్ర
ముందుగా మీ అబ్బాయిల భవిష్యత్ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపైన మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా జీవిత బీమా పాలసీని తీసుకోండి. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా.. విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి అందేలా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్లో మదుపు చేసినప్పుడు మంచి రాబడికి అవకాశం ఉంటుంది. నేరుగా స్టాక్‌లో మదుపు చేసినప్పుడు కాస్త నష్టభయం ఉంటుంది. షేర్ల ఎంపికపై మంచి అవగాహన, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకునేందుకు వీలవుతుందని భావించినప్పుడే వీటిని ఎంచుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోండి. నెలకు రూ.10వేలను 13 శాతం రాబడి అంచనాతో 12 ఏళ్లు పెట్టుబడి పెడితే.. రూ.30,78,000 అయ్యేందుకు అవకాశం ఉంది.
*మా నాన్న వయసు 59. జీవిత బీమా పాలసీ వ్యవధి తీరడంతో రూ.4 లక్షల వరకూ వచ్చాయి. వీటిని కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మదుపు చేద్దాం అనుకుంటున్నాం. వీటిలో నష్టభయం ఉంటుందా? ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు?
- శ్రావణి
కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కాస్త నష్టభయం ఉంటుంది. మీరు చేసిన డిపాజిట్ వ్యవధి తీరే నాటికి ఆ సంస్థ నష్టాల్లో ఉంటే.. మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోయే ఆస్కారం ఉంది. వీటికి ఎలాంటి డిపాజిట్ ఇన్సూరెన్స్ వర్తించదు. అన్ని కార్పొరేట్ సంస్థలూ ఇలాగే ఉంటాయని చెప్పలేం. కొన్ని పెద్ద కార్పొరేట్లు సాధారణ డిపాజిట్‌కంటే ఎక్కువ వడ్డీనిస్తాయి. నష్టభయమూ తక్కువగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఇలాంటి మంచి కంపెనీలను ఎంచుకొని, ఏడాది వ్యవధికి డిపాజిట్ చేయండి. ఆ తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో ఆ డబ్బును జమ చేయొచ్చు.
*మాకు ఇటీవలే వివాహం అయ్యింది. మా ఇద్దరి పేరుమీద కలిసి టర్మ్ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా?
- వినోద్
కొన్ని బీమా కంపెనీలు దంపతులిద్దరికీ కలిసి ఉమ్మడి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. మీకు కావాల్సిన బీమా రక్షణను ఒకే కంపెనీ నుంచి కాకుండా.. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థలను ఎంచుకొని, సమాన మొత్తాల్లో పాలసీని తీసుకోండి. వీలైనంత వరకూ విడివిడిగా పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నించండి.
* నా వయసు 23 ఏళ్లు. నెలకు రూ.8 వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు సరైన సమయమేనా? నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?
- ఫణి
మీపైన ఆధారపడిన వారు ఉంటే తగిన మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను తీసుకోవడం మర్చిపోవద్దు. మూడు నుంచి ఆరు నెలలకు సరిపోయే ఖర్చులను అత్యవసర నిధిగా సిద్ధం చేసుకోండి. చిన్న వయసు నుంచే పెట్టుబడులను ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయి. నెలకు రూ.8వేల చొప్పున మీకు 60 ఏళ్లు వచ్చే వరకూ మదుపు చేస్తూ వెళ్తే 13 శాతం రాబడి అంచనాతో దాదాపు రూ.1,92,80,000 మీ చేతిలో ఉంటాయి. జీతం పెరిగినప్పుడల్లా పెట్టుబడిని పెంచుకోండి. మీకు జమయ్యే డబ్బు మరింత పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్లలో కాస్త నష్టభయం ఉంటుంది. కాబట్టి, ఎప్పుటికప్పుడు పథకాల పనితీరును గమనిస్తూ పెట్టుబడులు కొనసాగించాలి.
- తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: లఖ్‌నవూ ‘షాకింగ్’ పిచ్.. క్యురేటర్‌పై వేటు..!
-
Movies News
Multiverses: ఇండస్ట్రీ నయా ట్రెండ్.. సినిమాటిక్ యూనివర్స్
-
World News
Pakistan: ఆత్మాహుతి దాడిలో 93కు పెరిగిన మృతులు.. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఘటన
-
Sports News
Team India: ధావన్ వస్తాడా...? ఇషాన్‌కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్ స్పందన ఇదీ..
-
General News
CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
India News
Economic Survey 2023: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్