ప్రీమియం మొత్తం వెనక్కి రాదా?
ఇటీవలే మాకు అమ్మాయి పుట్టింది. తనకు భవిష్యత్తులో ఉపయోగపడేలా నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. ఇందులో బంగారమూ ఉండాలని అనుకుంటున్నాం. ఎలాంటి పెట్టుబడులను ఎంచుకోవాలి?
ఇటీవలే మాకు అమ్మాయి పుట్టింది. తనకు భవిష్యత్తులో ఉపయోగపడేలా నెలకు రూ.15వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. ఇందులో బంగారమూ ఉండాలని అనుకుంటున్నాం. ఎలాంటి పెట్టుబడులను ఎంచుకోవాలి?
ప్రణీత్
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపై వార్షికాదాయానికి కనీసం 12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ తీసుకోండి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని దీనికోసం ఎంచుకోవచ్చు. రూ.15వేలలో రూ.8వేలను డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయండి. రూ.2వేలను గోల్డ్ మ్యూచువల్ ఫండ్లకు మళ్లించండి. మిగతా రూ.5వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. ఇలా 20 ఏళ్లపాటు క్రమం తప్పకుండా నెలనెలా మదుపు చేస్తే.. సగటున 11 శాతం రాబడితో రూ.1,15,56,500 జమయ్యే అవకాశం ఉంది.
నేను నాలుగేళ్ల క్రితం ఒక యూనిట్ ఆధారిత పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలసీని రద్దు చేసుకోవడం సాధ్యమేనా? నేను చెల్లించిన ప్రీమియంతో పోలిస్తే తక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి?
రవి
యూనిట్ ఆధారిత పాలసీలను కనీసం అయిదేళ్లపాటు కొనసాగించాలి. అప్పుడే వాటిని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రీమియం చెల్లించడం ఆపేసినా, పాలసీకి అయిదేళ్లు నిండాకే మొత్తం డబ్బును వెనక్కి తీసుకోగలరు. స్వాధీన రుసుములూ వర్తిస్తాయి. ముందుగా మీరు బీమా సంస్థ సేవా కేంద్రం లేదా శాఖను సంప్రదించండి. మీ ఫండ్ విలువ ఎంతుందో తెలుసుకోండి. పాక్షికంగా కొంత మొత్తం వెనక్కి తీసుకోవచ్చా? పాలసీని స్వాధీనం చేయొచ్చా? అనే వివరాలు తెలుస్తాయి.
నా వయసు 69. ఇప్పుడు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. బ్యాంకులోనూ ఈ పాలసీ ఇస్తారంటున్నారు. నిజమేనా?
నరేందర్
కొన్ని బ్యాంకుల్లో బృంద ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీ ఖాతా ఉన్న బ్యాంకులో ఇలాంటి వెసులుబాటు ఉందా లేదా ముందుగా తెలుసుకోండి. ఈ పాలసీల్లో ప్రీమియం తక్కువగా ఉన్నప్పటికీ గది అద్దె పరిమితి, సహ చెల్లింపులాంటివి ఉంటాయి. ముందుగా నిబంధనలు తెలుసుకోండి. సాధారణ బీమా పాలసీని తీసుకొని, అదనంగా ఈ పాలసీని ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలు పూర్తిగా వెల్లడించండి.
నేను చిరు వ్యాపారిని. నెలకు రూ.10వేల వరకూ ఏదైనా పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. నా వయసు 37. కాస్త సురక్షితంగా ఉండేలా ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
శ్రీకాంత్
ముందుగా మీరు కనీసం ఆరు నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధిగా సిద్ధం చేసుకోండి. వీటిని బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్లలో జమ చేయండి. మీ పేరుపై టర్మ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి అంతటికీ వర్తించే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడులు మొదలు పెట్టండి. దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగించాలనుకుంటే.. రూ.4వేలను నెలనెలా పూర్తి సురక్షితంగా ఉండే పీపీఎఫ్ ఖాతాలో జమ చేయండి. రూ.6వేలను ఎస్‌ఐపీ ద్వారా హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లు, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. ఫండ్లలో కాస్త నష్టభయం ఉన్నా, దీర్ఘకాలంలో మంచి రాబడికి వీలుంది.
తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: కెరీర్లో ఇలాంటివి సహజం.. వాటిని అధిగమించడమే సవాల్: ధావన్, యువీ
-
Politics News
TDP : ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ..
-
India News
Rahul Gandhi: ఆయన క్షమాపణలు చెప్పారని నిరూపించండి: రాహుల్‌కు సావర్కర్ మనవడి సవాల్
-
General News
TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం