ఉన్నత చదువుకు తోడుండేలా...

ఇల్లు కొనాలనే ఆలోచనతో రూ.15 లక్షల వరకూ జమ చేశాను. ఇప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్నంత రుణం రావడం లేదు.

Published : 05 May 2023 05:12 IST

1) ఇల్లు కొనాలనే ఆలోచనతో రూ.15 లక్షల వరకూ జమ చేశాను. ఇప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్నంత రుణం రావడం లేదు. వడ్డీ రేట్లు తగ్గేంత వరకూ ఈ మొత్తాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి. దీంతోపాటు నెలకు రూ.20వేలు మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేయాలి?

రాజేంద్ర
ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో రుణ మొత్తం తగ్గుతోంది. ఏడాది తర్వాత ఈ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. మీరు ఇల్లు ఎప్పుడు కొనాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. ఆ వ్యవధికి మీ దగ్గరున్న రూ.15లక్షలను బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. నెలనెలా రూ.20వేలనూ రికరింగ్‌ డిపాజిట్‌లో జమ చేయండి. వడ్డీ రేట్లు తగ్గి, మీ ఆదాయం పెరిగినప్పుడు రుణ అర్హతా పెరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏడాది తర్వాత ఇళ్ల ధరలూ కొంత మేరకు అధికం అవుతాయి. కాబట్టి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


3) నేను పనిచేస్తున్న సంస్థ నుంచి రూ.3 లక్షల ఆరోగ్య బీమా ఉంది. దీనికి టాపప్‌ పాలసీ ఎంత మొత్తానికి తీసుకోవాలి?
శ్రీకాంత్‌
ముందుగా మీరు సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. బృంద బీమా ఉద్యోగంలో ఉన్నప్పుడే రక్షణ కల్పిస్తుంది. సొంతంగా రూ.5లక్షల పాలసీ తీసుకొని, దానిపై రూ.20లక్షల వరకూ టాపప్‌ పాలసీ తీసుకోవడం మంచిది.


2) మా బాబు పేరుమీద నెలకు రూ.8వేల వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాం. తన వయసు 13. ఎలాంటి పథకాల్లో మదుపు చేయాలి? కనీసం 15 శాతం వరకూ రాబడి వస్తుందా?

సునీత
ముందుగా మీ బాబు భవిష్యత్‌ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం ఇంటి పెద్ద పేరుపైన తగినంత జీవిత బీమా పాలసీని టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా తీసుకోండి. మీ బాబు ఉన్నత చదువులు నాలుగైదు ఏళ్ల తర్వాతే మొదలవుతాయి. కాబట్టి, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.8వేలను క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. 12-13 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. మార్కెట్‌ పనితీరు బాగున్నప్పుడు 15 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. నెలకు రూ.8వేల చొప్పున ఏడేళ్లపాటు మదుపు చేస్తే 13 శాతం రాబడి అంచనాతో రూ.10లక్షలు జమ అయ్యే అవకాశం ఉంది.


4) మా అమ్మాయి పేరుమీద ఒకేసారి రూ.4 లక్షలు మదుపు చేసి, 15 ఏళ్ల వరకూ కొనసాగించాలని అనుకుంటున్నాం. ఇందులో కొంత బంగారమూ ఉండాలని ఆలోచన ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

ప్రదీప్‌
మీరు మదుపు చేద్దామనుకుంటున్న రూ.4లక్షల్లో రూ.లక్షను గోల్డ్‌ ఫండ్లకు కేటాయించండి. మిగతా రూ.3లక్షలను హైబ్రిడ్‌ ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఇలా చేయడం వల్ల సగటున 11 శాతం రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. 15 ఏళ్ల తర్వాత రూ.19,13,835 వచ్చేందుకు అవకాశం ఉంది.
తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు