Bajaj Auto: విశాఖపట్నంలోనూ చేతక్‌ బుకింగ్‌

విద్యుత్తు స్కూటర్‌ చేతక్‌ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయనున్నట్లు బజాజ్‌ ఆటో గురువారం తెలిపింది. 2022 తొలి 6 వారాల్లోనే 12 కొత్త నగరాలను జత చేసినట్లు వివరించింది. 2021లో 8 నగరాల్లో మాత్రమే ఈ

Updated : 18 Feb 2022 09:03 IST

ముంబయి: విద్యుత్తు స్కూటర్‌ చేతక్‌ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయనున్నట్లు బజాజ్‌ ఆటో గురువారం తెలిపింది. 2022 తొలి 6 వారాల్లోనే 12 కొత్త నగరాలను జత చేసినట్లు వివరించింది. 2021లో 8 నగరాల్లో మాత్రమే ఈ స్కూటర్‌కు బుకింగ్‌లను సంస్థ ఎంపిక చేసింది. కొత్తగా ఎంపిక చేసిన 12 నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖపట్నం ఉంది. ఇప్పుడు దేశీయంగా 20 నగరాల్లో ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని, డెలివరీకి 4-8 వారాల సమయం పడుతోందని సంస్థ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని