గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం రూ.87 కోట్లు

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 08 Nov 2023 19:15 IST

దిల్లీ: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.87.30 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.156.18 కోట్లతో పోలిస్తే 44.1% తగ్గింది. సంస్థ కార్యకలాపాల ద్వారా రూ.3,937.61 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.4,021.04 కోట్లు. వడ్డీ, పన్నులు, తరుగుదల (EBITDA) కంటే ముందు ఆదాయం 20.5% వృద్ధితో రూ.265.50 కోట్లకు చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని