Infosys Foundation: ఇన్ఫోసిస్‌ దాతృత్వం.. కర్ణాటక పోలీసులకు ₹33 కోట్లు

సైబర్‌ నేరాలపై యుద్ధంలో భాగంగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కర్ణాటక పోలీసులకు భారీ సాయం అందించింది.

Published : 10 Apr 2024 19:27 IST

బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. సైబర్‌ నేరాలపై పోరాటంలో భాగంగా బెంగళూరు పోలీసులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందజేసింది. కర్ణాటక పోలీసుల సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా రూ.33 కోట్లు మంజూరుచేసింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ విభాగం బుధవారం వెల్లడించింది. ఈమేరకు బెంగళూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్‌ ఫర్‌ సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చి(CCITR) సహకారాన్ని పునరుద్ధరించేందుకు వీలుగా  సీఐడీ, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(DSCI)తో చేసుకున్న ఎంవోయూపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. CCITRతో అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించడం ద్వారా సైబర్ నేరాల్లో దర్యాప్తు సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని